KMR: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి అండర్-14 బాల బాలికల సెపక్ తక్రా క్రీడా ఎంపికలు గాంధారీ మండలం, పోతంగల్ కలాన్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి. ఈ పోటీలలో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు తెలిపారు.