NZB: సికింద్రబాద్ నుంచి NZB – KMR మీదుగా ఢిల్లీకి వీకెండ్ స్పెషల్ ట్రైన్ నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్ తెలిపారు. సికింద్రబాద్ నుంచి అకోలా మీదుగా నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ చేరుకుంటుందన్నారు. ఈ నెల 28, నవంబర్ 2న సికింద్రబాద్ నుంచి వెళ్లి.. ఈ నెల 30,నవంబర్ 4న రిటర్న్ అవుతుందని వెల్లడించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.