KNR: వీణవంక మండలంలోని కొర్కల్ గ్రామ మానేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, అంబాల రాజ్ కుమార్, పాశల సతీష్, ఎల్కపల్లి రాహుల్, బండ అరవింద్ అనే నలుగురిపై కేసు నమోదు చేసినట్లు వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.