విశాఖ ఎంవీపీ కాలనీలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరాం గుప్తా, వరప్రసాద్ కలిసి నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు దాడి చేశారు. ప్రింటర్స్, ఫోన్లు, కరెన్సీ తయారీ సామాగ్రి, లాప్టాప్, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.