TG: బీసీ సంఘాల నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ బీసీ బిల్లుపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు ఆందోళన చేపట్టే అవకాశం ఉన్నందున వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్ట్‌లను బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తీవ్రంగా ఖండించారు. బీసీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.