TG: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయంలో వెరైటీ ఆచారం ఉంది. ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం బయటికి వెళ్లే భక్తుల తలపై ఉద్దాల(పాదుకలు)ను పెట్టి ఆశీర్వచనం ఇస్తారు. ఏటా మాఘమాసంలో ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారు రాత్రి సమయంలో ఈ పాదుకలనే ధరించి ఆలయం వెలుపల సంచరిస్తూ.. భక్తులను రక్షిస్తాడని విశ్వాసం.