KRNL: ఈ ఏడాది ఖరీఫ్ పత్తిని మద్దతు ధరకు విక్రయించాలనుకునే రైతులు తమ పేర్లను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి బుధవారం సూచించారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నవారే పత్తిని విక్రయించగలరని తెలిపారు. పత్తిలో తేమ శాతం 8-12% మధ్య ఉండాలని, 12% మించితే సీసీఐ కొనుగోలు చేయదని హెచ్చరించారు.