ప్రకాశం: పొన్నలూరు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొన్నలూరు మండల తహసీల్దార్ పుల్లారావు ప్రజలకు సూచించారు. మండల పరిధిలో పాలేరు వాగు ప్రవహించే ఏడు గ్రామ పంచాయతీలు కోటపాడు,చెన్నిపాడు,రావులకొల్లు, ఉప్పలదిన్నె, వేంపాడు, ముప్పాళ్లలు హై రిస్క్ జోన్లో ఉన్నాయన్నారు. ఆయా పంచాయతీలలో రెవిన్యూ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.