ELR: మండవల్లి మండలం మండవల్లి గ్రామానికి చెందిన చిగురుపాటి సుకుమార్ (24) ప్రైవేట్ ఎలక్ట్రిషయన్గా పనిచేస్తున్నాడు. బుధవారం పెదపాడు మండలం ఏపూరులో ఎలక్ట్రికల్ లైన్లు మార్చే పనికి వెళ్ళాడు. ఎలక్ట్రికల్ స్తంభం ఎక్కిన కొద్దిసేపటికే అతను విద్యుత్ ఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి పనివారు అతన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందాడు.