HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నవంబర్ 11వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఉప ఎన్నికలకు 211 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే గతంలో నల్గొండ పార్లమెంటుకు 1996లో 470 మందికి పైగా, నిజామాబాద్ గత పార్లమెంట్ ఎన్నికల్లో 185 నామినేషన్లు దాఖలు కాగా, అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రం ఇంత భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడం ఇదే ప్రథమం.