SRCL: సమాజంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా పోలీస్ స్టేషన్లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది పోలీసుల ప్రాణ త్యాగాల వల్లే ఇవాళ మనం ఎంతో ప్రశాంత జీవనం గడుపుతున్నామన్నారు.