ప్రకాశం: జిల్లాకు మరో 2 రోజుల పాటు భారీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్వామి గురువారం తెలిపారు. టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు తుఫాను హెచ్చరిక ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.