ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు గ్యాంగ్స్టర్లు మృతి చెందారు. మృతులు బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. మరణించిన వారిలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ రంజన్ పాఠక్ ఉన్నాడు. ఈ ఆపరేషన్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, బీహార్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ ఎన్కౌంటర్పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.