కోనసీమ: విద్యార్థుల ఆధార్ నవీకరణకు తాజాగా అవకాశం కల్పించారు. జిల్లాలో నేటి నుంచి 31 వరకు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ ప్రక్రియ ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. దీనికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ద్వారా సిబ్బందిని కేటాయించారు. గతంలో పలుమార్లు బయోమెట్రిక్ అప్డేట్ చేసినా ఇంకా చాలామంది మిగిలిపోవడంతో మరో అవకాశం ఇచ్చారు.