ప్రకాశం: త్రిపురాంతకం మండలంలోని గ్రామ సచివాలయాలలో నేటి నుంచి 30వ తేదీ వరకు ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రాజ్ కుమార్ తెలిపారు. ఈనెల 23 నుంచి 24 వరకు త్రిపురాంతకంలో, 25 నుంచి 26 వరకు దూపాడులో, 27 నుంచి 28 వరకు గణపవరంలో, 29 నుంచి 30 వరకు మేడపి గ్రామ సచివాలయంలో ఈ ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.