కోనసీమ: కొత్తపేట మండలం అవిడి, గ్రామ పంచాయతీ వద్ద గురువారం వేమగిరి, పరమహంస యోగానంద నేత్రాలయం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ శిబిరంలో ఉచితంగా అన్ని కంటి పరీక్షలు మందులు, అవసరమైన వారికి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.