PDPL: తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీపెల్లి రవీందర్ పిలుపునిచ్చారు. బుధవారం పాలకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాదాపు 200 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయని తెలిపారు.