NLG: కార్యకర్తలకు BRS ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆ పార్టీ చండూరు మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. మండలంలోని గుండ్రపల్లికి చెందిన BRS కార్యకర్త కురుపాటి నగేశ్ ఇటీవల గుండెపోటుతో మరణించాడు. బుధవారం పార్టీ మండల నాయకులు నగేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మండల కమిటీ ఆధ్వర్యంలో రూ.55 వేల ఆర్థిక సాయం అందజేశారు.