TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై BRS నేతలకు మాజీ సీఎం KCR దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం, పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. దీనిలో భాగంగా ఇవాళ పార్టీ MLAలు, MLCలు, ముఖ్య నేతలతో KCR సమావేశం కానున్నారు. కాగా, ఉప ఎన్నిక ప్రచారంలో KCR పాల్గొననున్నట్లు సమాచారం.