రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఇవాళ మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ముర్ము వర్కలలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం అయిన శివగిరి మఠాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కేరళలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.