NRML: పట్టణంలోని ఈద్గాం ప్రాంతంలో ఉన్న నక్షత్ర హోటల్లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు. రూ.9 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ అధికారి ప్రభాకర్ తెలిపారు.