SRPT: సైబర్ నేరగాళ్లు వాట్సాప్ గ్రూపుల ద్వారా వివిధ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు SP నరసింహ తెలిపారు. ముఖ్యంగా RTA చలాన్, TS చలాన్ యాప్‌ల పేరుతో నకిలీ APK ఫైల్స్‌ను పంపుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ అలాంటి లింక్‌లను డౌన్లోడ్ చేయరాదని హెచ్చరించారు. ఈ ఫైల్స్, లింక్‌లను డౌన్లోడ్ చేయడం వల్ల ఫోన్ హ్యాక్‌కు గురువుతుందన్నారు.