AP: భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని 14 జిల్లాలకు వాతావరణశాఖ ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని అధికారులు సూచించారు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.