ADB: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని దహిగూడ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ కంది శ్రీనివాసరెడ్డిని బుధవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన దండారి గుస్సాడీ ఉత్సవాల్లో ఆయన పాల్గొని సందడి చేశారు. కనుమరుగైపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.