W.G: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదవడం నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ పట్టణంలోని పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రపరచాలన్నారు.