BHNG: యాదాద్రి జిల్లా రాజపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువు గ్రామానికి చెందిన కర్రె మహేశ్ (22) బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. మహేశ్ తండ్రి కనకయ్య తన తల్లి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. ఈ సమయంలో మహేశ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది.