AP: తుని అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు గల్లంతయ్యాడు. తుని గ్రామీణ పీఎస్ నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా.. తప్పించుకుని సమీపంలో ఉన్న తుని కోమటి చెరువులో దూకాడని పోలీసులు చెబుతున్నారు. వాష్‌రూమ్‌కు వెళ్లాలని చెబితే వాహనం ఆపినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం గజఈతగాళ్లతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.