టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే నేడు. ఆయన ఇప్పుడు కేవలం హీరో కాదు, ఆయనే ఒక ఇండస్ట్రీగా మారారు. ‘బాహుబలి’తో భారతీయ సినిమా సత్తాను రూ.వందల కోట్ల నుంచి రూ.వేల కోట్లకు మార్చిన ఘనత ప్రభాస్‌కే దక్కుతుంది. పాన్ ఇండియా స్టార్ అనే పదానికి అచ్చమైన నిర్వచనంగా నిలిచారాయన. కథానాయకుడిగా ఎదిగినా.. తక్కువ మాట్లాడి, ఎక్కువ పనిచేసే పద్ధతే ఆయన విజయ రహస్యం.