E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు వెంకటేశ్వర నగర్, మురళికొండ ప్రాంతాలలో గురువారం ఉదయం ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగాయి. ఈ పనులను రూరల్ మండలం టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్ పరిశీలించారు. పంచాయతీ పరిధిలోని ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజు చెత్తసేకరణ చేసే వాహనాలతో వచ్చే పారిశుధ్య కార్మికులుకు చెత్తను అందచేయాలన్నారు.