AP: రాష్ట్రంలోని నెట్వర్క్ ఆస్పత్రులు ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చాయి. రూ.2600 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిన్న రూ.250 కోట్లు విడుదల చేసింది. అయితే సర్కార్ విడుదల చేసిన రూ.250 కోట్లకు అంగీకరించేది లేదని ఆస్పత్రులు స్పష్టం చేశాయి. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన చేస్తామని తేల్చి చెప్పాయి.