MDK: తూప్రాన్ పట్టణ హైవే బైపాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని చేగుంట మండలం పెద్ద శివునూర్ గ్రామానికి చెందిన బండారి దుర్గయ్య (55) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి హైవే రోడ్డు దాటుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన స్వామి (50) తీవ్రంగా గాయపడ్డాడు.