HYD: సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి,సోషల్ మీడియాలో అసభ్యకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని HYD సీపీ వీసీ సజ్జనార్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు నందిపాటి మురళి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్న ఆపోస్టులను తక్షణమే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు.