GNTR: పెదకాకాని శ్రీ మల్లేశ్వరస్వామి వారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్ కృష్ణారావు దంపతులు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు వారికి దేవాలయ విశిష్ఠతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏసీ గోగినేని లీలా కుమార్, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.