GNTR: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన రాజకీయ అంశాలు, పార్టీ ‘కోటి సంతకాల సేకరణ’ వివరాలపై ఆయన మాట్లాడనున్నారు. నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములపై కూడా వివరాలు వెల్లడించనున్నారు.