W.G: మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా కరుగోరుమిల్లిలో ఇవాళ స్థానికుల నుంచి సంతకాలు సేకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని వైసీపీ నియోజకవర్గ కన్వీనర్ రంగనాథ రాజు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చంటి, తదితరులున్నారు.