VSP: పద్మశ్రీ ఐ.వీ. సుబ్బారావు రైతు నేస్తం పురస్కారానికి విశాఖకు చెందిన డా. మాదిన ప్రసాదరావు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రైతు నేస్తం ఛైర్మన్, పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్నంలో సహాయ సంచాలకునిగా పనిచేస్తున్న డా. మాదిన ప్రసాదరావు.. పశు సంవర్ధక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.