JGL: మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును విమర్శించే అర్హత కాంగ్రెస్ పార్టీకి, జువ్వాడి కృష్ణారావుకు లేదని మెట్పల్లి మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి అన్నారు. జగ్గాసాగర్ నుంచి కొండ్రికర్ల రహదారి మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చొరవతో మంజూరు చేయబడిందని, నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడానికి వచ్చి ప్రజలను మోసం చేయడం సబబు కాదన్నారు.