RR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ మరింత అభివృద్ధికి కాంగ్రెస్ గెలుపు అవసరమన్నారు.