కృష్ణా: తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను తన నివాసంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలు, నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు, రైతుల సమస్యలు గురించి సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ప్రజల సమస్యలపై పోరాడాలని జగన్ సింహాద్రి రమేష్‌కు సూచించారు.