GNTR: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఆర్థిక స్థోమత లేని 51 మంది లబ్ధిదారులకు రూ. 42,34,920 విలువైన చెక్కులను అందజేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 360 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 3.80 కోట్లకు పైగా సాయం అందించినట్లు ఎమ్మెల్యే యరపతినేని తెలిపారు.