NGKL: అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్ను బుధవారం సాయంత్రం అచ్చంపేట DSP పల్లె శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో పలు రికార్డులను పరిశీలించారు. క్రైమ్ రేటును పోలీస్ అధికారులను అడిగితెలుసుకున్నారు. శాంతి భద్రత పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఐ శంకర్ నాయక్, ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.