NLG: నిడమనూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కమిటి సభ్యులు కొండేటి శ్రీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షాలకు తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులను పరామర్శించారు.