PLD: నరసరావుపేటలో 200 టిడ్కో ఇళ్లను గురువారం లబ్ధిదారులకు అప్పగించనున్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదే రోజున జరిగే ‘విజన్ 2047’ భారీ ర్యాలీలో పాల్గొనాలని కలెక్టర్ కృతిక శుక్లాను ఎమ్మెల్యే కోరారు. ర్యాలీ ద్వారా యువతలో చైతన్యం పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.