ప్రకాశం: కలెక్టర్ రాజాబాబు బుధవారం తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. జిల్లాలో తుఫాను పరిస్థితి సమీక్షిస్తూ, అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం టంగుటూరు, కొత్తపట్నం, సింగరాయకొండ మండలాలలో పర్యటించి మత్స్యకారులకు పలు సూచనలు చేశారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.