SRCL: సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్ సీఎంఆర్ లక్షం పై జిల్లాలోని రైస్‌మిల్లర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లో 479922 టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నారు.