PDPL: నేరాల నియంత్రణకు ముఖ్యమైన సీసీ కెమెరాలు రామగిరి మండలంలో అలంకారప్రాయంగా నిలుస్తున్నాయి. మూడు నెలలుగా మండలంలో వరుస చోరీలు, రెండు హత్యలు జరిగినా వాటి గురించి పట్టించుకునే వారే కరవయ్యారు. గతంలో సీసీ కెమెరాల నిర్వహణ సర్పంచుల ఆధీనంలో ఉండేది. వారి పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలనలో నిర్వహణను గాలికి వదిలేశారు. మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.