GNTR: తాడేపల్లిలో వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ను రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ శాలిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్య బాధ్యతలు అప్పగించినందుకు ఆమె జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం మహిళా వర్గాల్లో మరింత చైతన్యం తీసుకువచ్చే దిశగా కృషి చేస్తానని శాలిని తెలిపారు. మహిళల సాధికారతకు వైసీపీ ఎన్నో పనులు చేసిందన్నారు.