VZM: బొబ్బిలిలోని ఓ కోలనీలో 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడిన నరసింగరావు (42)కి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను పోక్సో కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. జూలైలో నమోదైన కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐ సతీష్ కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.