KNR:చొప్పదండి పట్టణ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఈ నిధులు మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇందుకు చొప్పదండి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.