MNCL: జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువకులకు స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రొఫెషనల్, IT రంగాలలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 6లోగా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.